అమెరికా సైనిక చర్య: ఇరాన్ పై దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు

రిపోర్టర్: సురేష్ స్థలం: వాషింగ్టన్

ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఖేష్క్ ద్వీపంతో పాటు పలు ప్రాంతాల్ లో పరిమిత స్థాయిలో మిలిటరీ దాడులు నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ దాడుల్ లో రాడార్ డిటెక్టర్లు, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడుల వార్తలు వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.