రాజాపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట తహశీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల తొలగింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేసి తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.