ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్: అదనపు పెన్షన్ పెంపునకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీలో రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. 2027 జనవరి నుంచి 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ అమలు చేయనున్నారు. అలాగే, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను బలోపేతం చేస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు నిధులను క్రమం తప్పకుండా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ. 2,880 కోట్ల అదనపు భారం పడనుంది.