జన్నారంలో ఇసుక టిప్పర్ సీజ్ చేసి భరతం పట్టిన ఫారెస్ట్ అధికారులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్ను ఎఫ్ఆర్వో ఖాదర్ వలీ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ రమేష్ రావు, మల్లేష్, రాజమల్లుపై నిబంధనల ప్రకారం తదుపరి విచారణ కొనసాగుతోందని, సీజ్ చేసిన వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.