ముంబైలో షాకింగ్ ఘటన: అడ్రస్ అడిగి వృద్ధురాలి గోల్డ్ చైన్ లూటీ
రిపోర్టర్: సునీల్
స్థలం: Mumbai
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కండివాలి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో దారుణం జరిగింది. ఇంటి తలుపు తెరుస్తున్న వృద్ధురాలిని ఒక వ్యక్తి చిరునామా అడిగి ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.