మద్యం దుకాణం సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి భారీ దోపిడీ

రిపోర్టర్: సునీల్ స్థలం: మనుబోలు

మండలంలోని మడమనూరు వద్ద మద్యం దుకాణ సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలను దుండగులు దోచుకెళ్లినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. కాగితాలపూరు మద్యం దుకాణంలో పనిచేస్తున్న రమేష్, గోపిలు రాత్రి ద్విచక్ర వాహనాల్లో ఇంటికి వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.