వైసీపీ ఆందోళనలు నిరసనలు కావు అరాచకాలు అంటూ బుద్దా వెంకన్న మండిపాటు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో వైసీపీ చేపట్టిన ఆందోళన నిరసన కాదని, అది పూర్తిగా అరాచకమని టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా విమర్శించారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అర్హులైన అభ్యర్థులకు ఎటువంటి పక్షపాతం లేకుండా నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌పై ఉన్న రాజకీయ అసూయతోనే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు.