బెంగళూరు కేఫ్ లో కొత్త సమస్య: కస్టమర్ల తీరుపై యజమాని ఆవేదన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బెంగళూరు
బెంగళూరు లోని ఇందిరానగర్ లో ఓ కేఫ్ యజమాని ఎదుర్కొంటున్న వినూత్న సమస్య చర్చనీయాంశమైంది. కేవలం నూట యాభై రూపాయల కాఫీ ఆర్డర్ ఇచ్చి, రోజంతా ల్యాప్టాప్ తో కూర్చుంటున్నారని విక్రమాదిత్య శుక్లా తెలిపారు. దీనివల్ల కొత్త కస్టమర్లు వచ్చి వెనక్ కి వెళ్తున్నారని, వ్యాపారం దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్ రివ్యూల భయంతో వారిని బయటకు పంపలేక యజమాని తీవ్ర తర్జనభర్జన పడుతున్నట్లు శుక్లా వెల్లడించారు.