తాడికల్ సర్పంచ్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శంకరపట్నం

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ సర్పంచ్ అకాల మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన సర్పంచ్ మరణం పార్టీకి తీరని లోటని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.