ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన
రిపోర్టర్: శివ
స్థలం: రంగారెడ్డి
ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు ఆమెను విచారించారు. గత విచారణలో అడిగిన ప్రశ్నలపై ఆమె లిఖితపూర్వక సమాధానం అందజేశారు. లుక్ అవుట్ నోటీసులు రద్దు చేసి లండన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆమె కోరగా, పోలీసులు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నారు.