మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై గవర్నర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇది శాసనసభ కాదని, దుశ్శాసన సభగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై దాడి ఘటనల వీడియోలను గవర్నర్‌కు చూపించి, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను వివరించారు.