మహిళా క్రీడాకారిణుల అభివృద్ధికి డబ్ల్యూఏపీఎల్‌ గొప్ప వేదిక: రాయపాటి శైలజ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే మహిళా క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. మంగళగిరిలోని కమిషన్‌ కార్యాలయంలో మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ టీజర్‌ను ఆమె మంగళవారం విడుదల చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారిణులు మరింత వెలుగులోకి వచ్చేందుకు ఈ టోర్నమెంట్‌ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.