పండుగ సీజన్ రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు: 24 గంటలూ మానిటరింగ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
పండుగ సీజన్ లో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు Ministry of Railways వెల్లడించింది. ప్రయాణికుల రాకపోకలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వార్ రూమ్ మరియు హీట్ మ్యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది.