సిక్కింలో కొండచరియలు విరిగిపడి భారీ నష్టమన్న సీఎం తమాంగ్
రిపోర్టర్: గోపి
స్థలం: సిక్కిం
సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లా రింబి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియల విరిగిపడటంపైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకపోయినా ఆస్తినష్టం భారీగా జరిగిందని, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.