బెంగళూరు-విజయవాడ కారిడార్: కీలక సొరంగం పనులు పూర్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: కడప

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా కడప-నెల్లూరు జిల్లాల మధ్య 3.68 కి.మీ సొరంగం తవ్వకం పనులను NHAI విజయవంతంగా పూర్తి చేసింది. రూ.1,092 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ప్రయాణ దూరం 110 కి.మీ తగ్గనుంది. 2027 నాటికి అందుబాటులోకి రానున్న ఈ మార్గం రవాణా సమయాన్ని 4 గంటల వరకు ఆదా చేయడమే కాకుండా, పారిశ్రామిక క్లస్టర్లకు రవాణా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు తెలిపారు.