సముద్రంలో ప్రాణాలు కాపాడుతున్న యువకులకు ప్రభుత్వ సాయం కరువవుతోంది

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

కావలి డివిజన్ సముద్ర తీర ప్రాంతాల్లో విహారానికి వచ్చి అలల్లో చిక్కుకుంటున్న ఎంతోమంది ప్రాణాలను పలువురు యువకులు కాపాడుతున్నారు. గత పదిహేడు సంవత్సరాలుగా ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నామని, అయితే లైఫ్ జాకెట్లు, రబ్బరు ట్యూబ్ ల వంటి కనీస రక్షణ సామగ్రి అందించాలని కోరినా ప్రభుత్వం స్పందించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.