కౌంటీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత పేసర్ ముకేష్ కుమార్
రిపోర్టర్: రమేష్
స్థలం: ఇండియా
భారత పేసర్ ముకేష్ కుమార్ ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ జట్టుతో చేరారు. ఈ సీజన్‌లోని చివరి రెండు మ్యాచ్‌లలో ఆయన బరిలోకి దిగనున్నారు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముకేష్, బెంగాల్ వెలుపల దేశీయ టోర్నీ ఆడటం ఇదే మొదటిసారి. ఈ కీలక సమయంలో జట్టు విజయాలకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.