అఫ్గానిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి ముగ్గురు మృతి

రిపోర్టర్: శివ స్థలం: అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్‌లోని ఈశాన్య కునార్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ భూభాగంలోకి చొచ్చుకొస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.