విమాన ప్రమాద ఘటన: సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Florida

అమెరికాలోని ఫ్లోరిడాలో లీర్జెట్ 60 విమానం కూలిపోయిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాన్ని నడిపిన మహిళా పైలట్ ఎవరనే దానిపై సాషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఊహాగానాలు చెలరేగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలెగ్జాండ్రా డడ్జియన్ మరియు నథాలియా ఫిల్గూయిరాస్ పేర్లు ప్రచారంలోకి రాగా, ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొందరు స్పష్టం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటనపై జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.