మార్లగుంటలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో వణికిపోతున్న గ్రామ ప్రజలు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలం మార్లగుంట గ్రామంలో పిచ్చికుక్కల బెడద తీవ్రమైంది. బయటకు రావాలంటేనే ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కొందరిని కరవగా, నేడు ఒకటో తరగతి బాలుడిని కుక్క తీవ్రంగా గాయపరిచింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది డక్కిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వీధికి పది చొప్పున తిరుగుతున్న కుక్కలను తక్షణమే నివారించి గ్రామస్తులను కాపాడాలని అధికారులు కోరుతున్నారు.