తల్లీబిడ్డల ఆరోగ్యంతోనే బలమైన సమాజం: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రిపోర్టర్: వెంకట్
స్థలం: తూర్పుగోదావరి జిల్లా
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో నిర్వహించిన రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలని సూచించారు. గర్భిణులు ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.