తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత.. స్పీకర్‌తో హరీశ్ రావు వాగ్వాదం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌తో ఎమ్మెల్యే హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ స్పీకర్ ఘాటుగా స్పందించారు. దళిత, గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్ రావు విమర్శించారు.