అభయ్ కుమార్ పాండేకు అరుదైన గౌరవం: ప్రపంచ టాప్ రెండు శాతం శాస్త్రవేత్తల్లో చోటు

రిపోర్టర్: నరేష్ స్థలం: Jorhat

అస్సాంలోని జోర్హాట్ టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ మైకాలజిస్ట్ డాక్టర్ అభయ్ కుమార్ పాండే ప్రపంచ టాప్ రెండు శాతం శాస్త్రవేత్తల జాబితాలో నాల్గవ సారి చోటు దక్కించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీ మొక్కల ఆరోగ్య పరిరక్షణ, శిలీంధ్ర వ్యాధుల నియంత్రణపై ఆయన చేస్తున్న పరిశోధనలకు ఈ ఘనత దక్కిందని, ఇది దేశంలోని టీ సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.