సిక్కింలో గ్లేషియల్ సరస్సుల ముప్పు: అప్రమత్తమైన ప్రభుత్వం

రిపోర్టర్: సతీష్ స్థలం: సిక్కిం

సిక్కింలో గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (గ్లోఫ్) ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన 16 సరస్సులను గుర్తించి, వాటిపై నిరంతరం నిఘా ఉంచింది. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో మంచు కరుగుదలపై పర్యవేక్షిస్తూ, నీటి మట్టాన్ని తగ్గించేందుకు సైఫన్, టన్నెళ్ల నిర్మాణం వంటి ఇంజనీరింగ్ పద్ధతులను అమలు చేస్తోంది. కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేసింది.