గోశాల, వేద పాఠశాల కోసం కలెక్టర్‌కు వినతి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లిలో గోశాల, వేద పాఠశాల, యజ్ఞశాల, వేద గాయత్రీ మాత ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ ప్రాంతంలో 300కు పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయని సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. తమ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.