అన్నదాతల ఆక్రోశం: తుఫాన్ల ప్రభావంతో మంగపేటలో నేలవాలిన ఖరీఫ్ వరి పంట

రిపోర్టర్: సురేష్ స్థలం: మంగపేట

మంగపేట మండలంలో అర్నబ్ మరియు మురుసు తుఫాన్ల ప్రభావంతో కోత దశకు వచ్చిన ఖరీఫ్ వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు పొలాల్ లో నీరు నిలవడంతో వరి నేలవాలిందని, ఎల్ నినో ప్రభావంతో కష్టపడి సాగు చేసిన నోటికాడి పంట తుఫాన్ల కారణంగా నేలపాలైందని రైతాం గం వాపోయారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఎకరాకు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.