తెలంగాణలో వైశ్య సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
తెలంగాణలో వైశ్య సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కల్పించిన అవకాశాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు కోరే రాజకీయ పార్టీలు వైశ్యుల అభివృద్ధి, వ్యాపార సమస్యలు, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. వైశ్య సంఘాలతో చర్చించి విద్య, ఉపాధి, వ్యాపారాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని, అన్ని రంగాల్లో సముచిత గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.