ఎస్సీ కాలనీలో రెండు సిమెంట్ రోడ్లు వేయించిన ఎమ్మెల్యే సురేష్

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు ఊపొందాయి. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా కాలనీకి వచ్చి రెండు ప్రధాన సిమెంట్ రోడ్లు వేయించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జలదంకి మండలం లింగరాజు అగ్రహారం ఎస్సీ కాలనీలో చేపట్టిన ఈ అభివృద్ధి పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.