'రాష్ట్రంలో కరువు పరిస్థితులపై జగన్ సమీక్ష': ప్రజా సమస్యలపై వైసీపీ కీలక భేటీ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి మరియు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.