పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం ఆగదన్న సీపీఎం నర్సింహ

రిపోర్టర్: వెంకట్ స్థలం: భువనగిరి

భువనగిరి మండలం పోచంపల్లి పరిధిలో కెమికల్ పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు, గాలి కలుషితమై ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. దోతిగూడెంలో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ పరిశ్రమలను పూర్తిగా తొలగించే వరకు ప్రజలతో కలిసి సీపీఎం కచ్చితంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.