అనకాపల్లిలో పేదలకు ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ

రిపోర్టర్: శివ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా మొత్తం 2,851 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.