కమీషన్ల మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సర్కార్ ఆరితేరిందంటూ హరీష్ రావు ఫైర్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ మరియు పవర్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. అయితే నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం, 30 శాతం కమీషన్ మేనేజ్మెంట్లో మాత్రం బాగా ఆరితేరిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.