నిరుద్యోగులకు భారీ ఊరట: ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి ఐదేళ్లు పెంపు

రిపోర్టర్: గోపి స్థలం: చెన్నై

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల నేరుగా నియామకాలకు సంబంధించిన గరిష్ఠ వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచుతూ సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వివిధ వర్గాలకు అమలవుతున్న వయోసడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల వెసులుబాటు కల్పించామని, ఈ కొత్త నిబంధనలు ఐదేళ్ల పాటు అమల్ లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.