భూ సమస్యల దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి, సంబంధిత రికార్డులను పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ భూ భారతి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని తెలిపారు.