పాల్వంచ కేటీపీఎస్ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాల కలకలం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ పాత క్వార్టర్స్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని ఉద్యోగులు, కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా లోపం కారణంగా కొందరు వ్యాపారాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి బాధితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.