పొన్నూరులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలి: ఎమ్మెల్యే నరేంద్రకుమార్

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

పొన్నూరు మండలంలోని ప్రతి ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - ఎమ్మెల్యే పొన్నూరు స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.