ఐడిబిఐ బ్యాంకు విక్రయం: విదేశీ సంస్థకు నియంత్రణాధికారంపై ఆర్థిక నిపుణుల ఆందోళన

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హెరాల్డింగ్స్ కు ఐడిబిఐ బ్యాంకు నియంత్రణాధికారాన్ని బదిలీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రశ్నలకు కేంద్రబిందువు అయిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక అభివృద్ధికి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన ఈ బ్యాంకును విదేశీ యాజమాన్యానికి అప్పగించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని వారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.