వైద్యులు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరుపయోగంగా మారుతున్న వైద్యసేవలు
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు అందడం లేదు. బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం, గంట్యాడ, దత్తిరాజేరు, మెంటాడ, రాజాం, శృంగవరపుకోట, కొత్తవలస, వేపాడ, ఎల్.కోట మండలాల్లోని పీహెచ్సీలలో డాక్టర్లు లేక స్టాఫ్నర్సులే ప్రాథమిక వైద్యం అందించి పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. ఆదివారాలు మరియు సెలవు రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని, ఇద్దరు వైద్యులు ఉన్నచోట కనీసం ఒక్కరైనా విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.