తిరుమల లడ్డూ కల్తీ కేసు: విచారణ మార్పు పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిందని అధికారులు తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో నియమితులైన ప్రత్యేక దర్యాప్తు బృందం తటస్థంగా, పారదర్శకంగా విచారణ జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఏపీలోనే కొనసాగుతుందని, వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.