ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. చదువుల తల్లి కృపతో పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు, విజ్ఞానం ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుండగా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.