చైనా విషయంలో భారత్ హెచ్చరికలను విస్మరించాం: బెల్జియం ప్రధాని

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

చైనా విషయంలో భారత్ చేసిన హెచ్చరికలను తాము విస్మరించడం వల్లే ఐరోపా దేశాలు నేడు సమస్యలు ఎదుర్కొంటున్నాయని బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ అన్నారు. దిల్లీలో జరిగిన CII కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చౌకైన విదేశీ వస్తువుల దిగుమతితో యూరప్ పారిశ్రామిక పునాది బలహీనపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సూచనలను అప్పట్లోనే పాటించాల్సిందని, ఇకపై భారత్ ఒక కీలక భాగస్వామిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.