నెల్లూరులో మట్టి తవ్వకాల కలకలం: రైట్లకు కోట్లలో రికవరీ నోటీసులు జారీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
గత ప్రభుత్వ పాలనలో అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమంగా తరలించిన వ్యవహారంలో నెల్లూరు జిల్లాలో రైట్లకు అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. అల్లీపురం, చిన్న చెరుకూరు ప్రాంతాల్లో పొలాల చదును పేరుతో అనుమతులు పొంది లేఅవుట్లు, పరిశ్రమలకు మట్టిని తరలించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. సుమారు ఎనభై మందికి పదకొండు కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు అందడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.