స్థానిక సంస్థల ఎన్నికలను తలపించిన ఎస్ఎంసీ కమిటీల ఎన్నికలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి. తెదేపా, వైకాపా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. చీపురుపల్లి జడ్పీ బాలురోన్నత పాఠశాలలో ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు మండలాల్లో కోరమ్ సరిపోక ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరికొన్ని చోట్ల రాజకీయ వివాదాల కారణంగా ఎన్నికలు ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.