అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: గుత్తి నరసింహ

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ నాయకుడు గుత్తి నరసింహ కోరారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పథకం ఫలాలు సకాలంలో అందాలని ఆయన సూచించారు.

ప్రభుత్వం కల్పించిన గడువులోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, సచివాలయ సిబ్బంది సాంకేతిక సమస్యలు లేకుండా సహకరించాలని ఆయన కోరారు. అర్హులు ఎవరూ అవకాశాన్ని కోల్పోకుండా పారదర్శకంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు.