కోనసీమ వాసులకు తీపి కబురు: కోటిపల్లి-నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు భారీ ఊరట

రిపోర్టర్: హరి స్థలం: కోనసీమ

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ భూసేకరణకు అడ్డంకిగా ఉన్న హైకోర్టు కేసులు కొట్టివేయడంతో ప్రాజెక్టుకు భారీ ఊరట లభించిందని అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. నాన్నగారు స్వర్గీయ జిఎంసి బాలయోగి జయంతి రోజున ఈ తీర్పు రావడం, భూసేకరణకు రాష్ట్ర వాటా నిధులు విడుదల కావడం ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. కోనసీమలో త్వరితగతిన రైలు పట్టాలెక్కేలా మరింత కృషి చేస్తానని గంటి హరీష్ మాధుర్ స్పష్టం చేశారు.