బీసీ ఏ వర్గాలకు అన్యాయం చేసే ప్రతిపాదనలు విరమించాలి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
బీసీ డీ గ్రూపులోని కులాలను బీసీ ఏ లో చేర్చడం వల్ల వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉట్నూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్ద కులాల చేరికతో కులవృత్తుల వారు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.