సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య కేసులో కీలక నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమృత్సర్
పంజాబ్ పోలీసులు ముంబై ఏటీఎస్ తో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య కేసులో కీలక నిందితుడు జోబన్ ప్రీత్ ను అరెస్ట్ చేశారని డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. అతని వద్ద నుంచి మూడు పిస్తుళ్లు, ఐదు మ్యాగజైన్లు, పదకొండు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు నిందితుడు ఆయుధాల రవాణా, ఫైనాన్స్ అందించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన స్పష్టం చేశారు.