ఆడబిడ్డల ఆత్మగౌరవంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన బీజేపీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Telangana
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఆడబిడ్డలకు అవమానం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారా అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అవకాశమడిగితే గెస్ట్‌హౌజ్‌కు పిలుస్తారా అని నిలదీస్తూ, కాంగ్రెస్ నేత తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసింది. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించింది.