వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో దూకుడు పెంచిన టీటీడీ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి

తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తొలి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు, తర్వాతి ఏడు రోజులు సర్వదర్శనం కల్పించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.