వైరల్ అవుతున్న జంగా సినిమా హీరో త్రిగుణ్ ఫస్ట్ లుక్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

యువ హీరో త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రంలో త్రిగుణ్ శివ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు కెవిన్ గడ్డం వెల్లడించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.